మేము ఏమి చేస్తాం?
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు, అప్పులు మరియు వ్యయాలకు సంబంధించిన విషయాలు మరియు వాటి ప్రభావం దినదినం క్లిష్టంగా మారుతుంది.
2. ప్రభుత్వ రంగ సంస్థల కార్యకలాపాలు బడ్జెట్‌లపై తీవ్రమైన ప్రభావాన్ని చూపించవచ్చు, ఉదాహరణకు బ్యాంకింగ్ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వంపై మరియు విద్యుత్ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ల పై గణనీయమైన ప్రభావం చూపుతాయి. అదేవిధంగా, నియంత్రణ సంస్థలు ప్రభుత్వం అందించే సేవలపైన మరియు ధరల నిర్ధారణపైనా కూడా ప్రభావం చూపుతాయి. బడ్జెట్ వ్యవస్థకు బైట ఉన్నటువంటి అభివృద్ధి ఆర్ధిక సంస్థలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. వీటి నిర్ణయాలు కేంద్ర రాష్ట్ర సంబంధాలపై మరియు అభివృద్ధిపై ప్రభావం చూపిస్తాయి, ఉదాహరణకు జాతీయ రహదారులకు నిధులు సమకూర్చడం వంటివి. వాతావరణ మార్పుల వల్ల వచ్చే సమస్యలను పరిష్కరించటం మరియు ప్రజలకు అవసరమైన అత్యవసర వస్తువులు మరియు సేవలను అందించటం వంటి అనేక బాధ్యతలను నెరవేర్చటం కోసం పెద్ద సంఖ్యలో కేంద్ర ప్రభుత్వం చర్యలను తీసుకుంటోంది.
3. ఈ సంక్లిష్టతల వలన మరియు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొనే చర్యల వలన తలెత్తే అనేక రకమైన సమస్యల యొక్క ప్రభావం వారి జీవితాలపై ఎలా ఉండబోతుందో పౌరులు అర్ధం చేసుకోవడం కష్టం అవుతుంది. నిర్ణయాలు తీసుకోవడంలో పారదర్శకత లేకపోవడం, సమాచారాన్ని స్పష్టంగా తెలియజేయకపోవడం వంటివి, ప్రభుత్వ ఆర్ధిక లావాదేవీలు మరియు కేంద్ర-రాష్ట్ర ఆర్ధిక లావాదేవీలకు సంబంధించిన సమస్యలను అర్థం చేసుకోవడంలో పౌరులకు కష్టతరం చేస్తున్నాయి.
4. పౌరులకు తమ అవగాహనను వివరించడానికి ముందు ఈ సంక్లిష్టతలను పూర్తిగా అర్ధం చేసుకొని వాటిని సామాన్య ప్రజలకు తెలపటంలో నిపుణులకు మరియు పరిజ్ఞానం కలవారికి కూడా సవాలుగా మారాయి.
5. భారతదేశంలో సామాన్య పౌరుడిని సాధికారుడిని చేసే లక్ష్యంతో పన్నులు మరియు వ్యయాల విషయాలు మరియు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలపై ప్రజల అవగాహనను మార్చడానికి ఈ సంస్థ (ఫోరం ఫర్ స్టేట్ స్టడీస్) ప్రయత్నిస్తుంది.
6. ఈ సంస్థ క్రింది వాటిపై అధిక-నాణ్యమైన మరియు పక్షపాత రహిత విశ్లేషణను అందించే ప్రయత్నం చేస్తుంది:
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్ధిక లావాదేవీలకు సంబంధించిన విధి విధానాలను వివరించడం
- ప్రజలకు మరింత మెరుగైన అవగాహనను కల్పించేలా సమాచారాన్ని స్పష్టమైన మరియు పారదర్శకమైన విధానంలో తెలియజేయడం
7. ఈ విధంగా ప్రజలు తమ ప్రయోజనాలపై ప్రత్యక్షంగా ప్రభావం చూపే సమస్యల గురించి మెరుగ్గా అర్ధం చేసుకోగలరని భావిస్తున్నాము. అప్పుడు ఒక సాధారణ పౌరుడు తన అభిప్రాయాలను స్పష్టంగా తెలియపరచగలడు.
8. రాష్ట్రాలకు సంబంధించిన అధ్యయనం కేవలం ఆర్ధిక విషయాలే కాకుండా మరిన్ని విషయాల పైన కూడా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఈ సంస్థ తమ కార్యకలాపాలను నెమ్మదిగా విస్తరిస్తూ, మరింత విస్తృతమైన సమస్యలను విశ్లేషించడానికి ప్రయత్నిస్తుంది: కేంద్ర-రాష్ట్ర సంబంధాలను నియంత్రించే సంస్థాగత ఏర్పాట్లు, వివిధ రంగాలలో రాష్ట్ర కార్యక్రమాల మరియు రాష్ట్రాల భాధ్యత ఎక్కువగా ఉండే ఆరోగ్యం, విద్య, వ్యవసాయం వంటి రంగాలు ఇందులో ఉన్నాయి.
9. ఈ క్రింద తెలిపిన వారి సహాయంతో దీన్ని సాధించడం మా లక్ష్యం:
- సాధారణ వ్యక్తులపై ప్రభావం చూపే ఆర్ధిక విషయాలపై అవగాహన ఉన్న వారు.
- పౌరుల యొక్క ఆలోచనలు మరియు సమస్యల గురించి ప్రత్యక్షంగా తెలుసుకోవటం.
మేము ఏమి చేస్తున్నాము మరియు ఎందుకు చేస్తున్నాము?
10. భారత ప్రభుత్వ వ్యయంలో అరవై శాతం పైగా రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేస్తున్నాయి మరియు ప్రభుత్వ ఉద్యోగులలో సుమారు 79 శాతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు. భారత రాజ్యాంగం ఏర్పరచిన సమాఖ్య నిర్మాణాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. జాతీయ పాలనలో రాష్ట్రాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నప్పటికీ, రాష్ట్ర ఆర్ధిక విధానాల గురించి పౌరులకు సరైన అవగాహన మరియు సమాచారం ఉండదు. అంతేకాకుండా, ప్రభుత్వాలు అన్ని స్థాయిలలో అభివృద్ధి కోసం చేసే ప్రతిపాదనలలో సవాళ్లను ఎదుర్కుంటున్నాయి. పరిపాలనలోని క్లిష్టమైన చిక్కులను విడదీసి, మనకు మరియు సామాన్య వ్యక్తులకు స్పష్టతను తేవలసిన అవసరం ఉంది.
మేము ఎవరు?
11. మాది ప్రభుత్వ విధానాలు మరియు కేంద్ర-రాష్ట్ర వ్యవహారాలలో ప్రమేయం ఉన్న ఆర్ధిక వేత్తల, న్యాయ నిపుణుల, మాజీ కేంద్ర మరియు వాణిజ్య బ్యాంకర్‌ల మరియు మాజీ అధికారులు ఉన్న బృందం. నిస్పక్షపాతంగా మా అభిప్రాయాలను స్పష్టంగా తెలియచేయడానికి నిబద్ధతతో మేము ఏకం అయ్యాము.